6న జిల్లా సబ్‌ జూనియర్‌ షూటింగ్‌ బాల్‌ జట్ల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

6న జిల్లా సబ్‌ జూనియర్‌ షూటింగ్‌ బాల్‌ జట్ల ఎంపిక

Apr 4 2025 12:45 AM | Updated on Apr 4 2025 12:45 AM

6న జి

6న జిల్లా సబ్‌ జూనియర్‌ షూటింగ్‌ బాల్‌ జట్ల ఎంపిక

మదనపల్లె సిటీ: జిల్లా సబ్‌ జూనియర్‌ షూటింగ్‌బాల్‌ బాల,బాలికల జట్లు ఎంపిక ఈనెల 6వతేదీన నిర్వహించనున్నట్లు జిల్లా షూటింగ్‌బాల్‌ కార్యదర్శి గౌతమి తెలిపారు. స్థానిక నిమ్మనపల్లె బైపాస్‌ రోడ్డులోని ప్రైమ్‌ స్పోర్ట్స్‌ అరేనాలో ఉదయం 9 గంటలకు ఎంపికలు జరుగుతాయన్నారు. క్రీడాకారులు 01.4.2008 తరువాత పుట్టినవారు అయివుండాలన్నారు. ఎంపికకు వచ్చే క్రీడాకారులు ఆధార్‌ కార్డు తప్పకుండా తీసుకురావాలన్నారు. వివరాలకు 62818 81022ను సంప్రదించాలని కోరారు.

పాలిసెట్‌కు ఉచిత శిక్షణ

మదనపల్లె సిటీ: పాలిటెక్నిక్‌ కళాశాలల ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్‌ పరీక్షకు విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు జీఎంఆర్‌ పాలిటెక్నిక్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ కె.ఓబులేసు తెలిపారు. ఈనెల 30వ తేదీన పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ప్రతి రోజు స్థానిక జీఎంఆర్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు. ఈ శిక్షణ ఏప్రిల్‌ 1తేదీ నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 95426 90906 ను సంప్రదించాలని కోరారు.

దరఖాస్తుల ఆహ్వానం

రాయచోటి జగదాంబ సెంటర్‌: అన్నమయ్య జిల్లాలోని రాయచోటి, కెవి పల్లిలో ఉన్న గిరి జన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి పలు తరగతులలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తు న్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ అధికారి డి.సురేష్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 5 నుండి 9వ తరగతులలో అర్హులైన విద్యార్థినుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు చెప్పారు. ఆసక్తి గల విద్యార్థినులు twreiscet.apcfss.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తులను ఈ నెల 9వ తేదీలోపు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 94411 46908, 7382264994, 94414 94161 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

బీసీ కులగణన చేపట్టాలి

రాయచోటి అర్బన్‌: రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులగణనను వెంటనే చేపట్టాలని బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ రమణ తెలిపారు. రాయచోటి పట్టణంలో గురువారం బీసీ సమన్వయ కమిటీ జిల్లాస్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా బీసీ కులగణనను చేపట్టడంతో పాటు బీసీల అభివృద్ధికి ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకోవాలంటూ కోరారు. బీసీల కులగణనతోనే రాజ్యాధికారంతో పాటు అన్ని రకాల అభివృద్ధి జరుగుతుందన్నారు. బీసీలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే క్రమంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఈనెల 11న అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌ ఎదుట బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపడతున్నామన్నారు. జిల్లాలోని బీసీలందరూ విజయవంతం చేయాలంటూ కోరారు. సమావేశంలో బీసీ సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ కె.వి.రమణ, కన్వీనర్‌ ఇడగొట్టు నాగేశ్వరరావు, నేతలు జీవానందంతో పాటు పలువురు పాల్గొన్నారు.

వృద్ధులకు ఆరోగ్య భరోసా

రాయచోటి అర్బన్‌: 70 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులకు ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా సంవత్సరానికి రూ.5 లక్షల వరకు ఆరోగ్యభరోసా కల్పించనున్నట్లు అన్నమయ్య జిల్లా ఎన్‌టీఆర్‌ వైద్యసేవా ట్రస్టు కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ లోక వర్దన్‌ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ – భారత ప్రధానమంత్రి జన ఆరోగ్యయోజన (పీఎంజేఏవై) ను ప్రారంభించిందన్నారు. పీఎంజేఏవై అనే పథకం అతిపెద్ద ఆరోగ్య భరోసా పథక అన్నారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ఒకొక్క కుటుంబానికి సంవత్సరానికి రూ.5లక్షల వరకు ఆరోగ్యబీమాను ఇస్తారన్నారు. అన్నమయ్య జిల్లాలో 1,10,298 నూతన ఆయుష్మాన్‌ భారత్‌ పీఎంజేఏవై లబ్ధిదారులను గుర్తించామన్నారు. ఇప్పటికే ఏఎన్‌ఎంలు తమ పరిధిలో ఉన్న 70 సంవత్సరాల సీనియర్‌ సిటిజన్స్‌ను గుర్తించి వారిని ఎన్‌రోల్‌మెంట్‌ చేసి ఈకేవైసీ చేసి పీఎంజేఏవై వయోవందన కార్డులను డౌన్‌లోడ్‌ చేయిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు కార్డులు పొందని అర్హులు తమ సచివాలయం పరిధిలోని ఏఎన్‌ఎంలను సంప్రదించి వయోవందన కార్డులను పొంది సద్వినియోగం చేసుకోవాలంటూ ఆయన విజ్ఞఫ్తి చేశారు.

6న జిల్లా సబ్‌ జూనియర్‌ షూటింగ్‌ బాల్‌  జట్ల ఎంపిక  
1
1/1

6న జిల్లా సబ్‌ జూనియర్‌ షూటింగ్‌ బాల్‌ జట్ల ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement