
టోల్‌ప్లాజా వద్ద ఆగిన అద్దె బస్సులు
రామాపురం : కర్నూలు – చిత్తూరు 40వ జాతీయ రహదారి బండపల్లె వద్ద గల టోల్‌ప్లాజాలో రాయచోటికి చెందిన ఏపీఎస్‌ఆర్టీసీ అద్దె బస్సులకు ఫాస్ట్‌ట్రాక్‌లో నిధులు లేకపోవడంతో అన్ని బస్సులను సోమవారం టోల్‌ప్లాజా సిబ్బంది ఆపేసి, పక్కన నిలబెట్టారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఆయా బస్సులలో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ సందర్భంగా బస్సు డ్రైవరు, కండక్టర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. ఒక్కసారిగా అన్ని బస్సులకు ఫాస్ట్ ట్రాక్ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. చివరకు బస్సు నిర్వాహకులు, యజమానులు, టోల్‌ప్లాజా వద్దకు చేరుకొని ఫాస్ట్ ట్రాక్ వేయడంతో ఒక్కో బస్సును టోల్‌ప్లాజా దాటించే ప్రయత్నం చేశారు.
అవస్థలు పడిన ప్రయాణికులు
ఎట్టకేలకు బస్సులకు ఫాస్ట్ ట్రాక్
వేయడంతో కదిలిన వైనం