
నిర్ణీత సమయంలోగా ఫిర్యాదులను పరిష్కరించాలి
రాయచోటి: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి తెలిపారు. సోమవారం అన్నమయ్య జిల్లా ఎస్పీ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ప్రజల నుంచి అదనపు ఎస్పీ నేరుగా ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను ముఖాముఖి మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను సంబంధిత పోలీస్ అధికారులకు అప్పగించి సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు మొదట ప్రాధాన్యతనిస్తూ సత్వరమే సమగ్ర విచారణ జరిపి వారి సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
అదనపు ఎస్పీ వెంకటాద్రి