మదనపల్లె : పట్టణంలోని సురభి కాలనీలో శనివారం రాత్రి చోరీ జరిగింది. చోరీలో 53 గ్రాముల బంగారం, 100 గ్రాముల వెండి, 97 వేల రూపాయల నగదు దొంగలు ఎత్తుకెళ్లారు. స్థానికంగా నివాసం ఉన్న రామకృష్ణ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం కుటుంబ సభ్యులతో కలిసి కలికిరి మండలం పాలమంద జాతరకు అత్త ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం తిరిగి ఇంటికి చేరుకోగా, అప్పటికే ఇంటి తలుపులు గడియ పగులగొట్టి ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ ఎరీషావలీ, ఎస్‌ఐ వెంకటశివకుమార్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. క్లూస్‌టీమ్‌తో ఆధారాలు సేకరించారు. ఇటీవల బ్యాంకు నుంచి విడిపించిన 53 గ్రాముల బంగారం, 100 గ్రాముల వెండి, బీరువాలో ఉన్న రూ.97 వేల నగదు చోరీకి గురైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎరీషావలీ తెలిపారు.
53 గ్రాముల బంగారం,
రూ.97 వేల నగదు చోరీ