ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీ నుంచి 14 శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఏప్రిల్ 1న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఏప్రిల్ 5న బ్రహ్మోత్సవాలకు అంకుకార్పణ నిర్వహించనున్నారు.ప్రతిరోజూ ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరగనున్నాయి.
● బ్రహ్మోత్సవాల్లో
వాహనసేవల వివరాలు
ఏప్రిల్ 6న ఉదయం 9.30 నుండి 10.15 గంటల వరకు బృషభలగ్నం నందు ధ్వజారోహణం, రాత్రి శేష వాహనం, 7న ఉదయం వేణుగానాలంకారం, రాత్రి హంస వాహనం, 8న ఉదయం వటపత్రశాయి అలంకారం, రాత్రి సింహవాహనం, 9న ఉదయం నవనీత కృష్ణాలంకారం, రాత్రి హనుమంత వాహనం, 10న ఉదయం మోహినీ అలంకారం, రాత్రి గరుడసేవ, 11న ఉదయం శివధనుర్భాణ అలంకారం, రాత్రి కల్యాణోత్సవం, గజవాహనం, 12న ఉదయం రథోత్సవం, 13న ఉదయం కాళీయమర్థనాలంకారం, రాత్రి అశ్వవాహనం, 14న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం, 15వ తేది సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 వరకు పుష్పయాగం నిర్వహించనున్నారు.