వెలుగులు ఎప్పుడు? | - | Sakshi
Sakshi News home page

వెలుగులు ఎప్పుడు?

Mar 23 2025 12:24 AM | Updated on Mar 23 2025 12:25 AM

హార్సిలీహిల్స్‌కు

బి.కొత్తకోట: ఎక్కడ చూసిన విద్యుత్‌ వెలుగులు కనిపిస్తుంటే పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌పై ఐదు హైమాస్‌ లైట్లున్నా వెలగని పరిస్థితి నెలకొంది. ఇక్కడి స్థానికులు, పర్యాటకులు ఎంతోకాలంగా ఎల్‌ఈడీ లైట్లు వేయాలని విన్నవిస్తున్నా ఎప్పుడు వేస్తారో తెలియని పరిస్థితి. ప్రతి పల్లెలో విద్యుత్‌ స్తంభాలకు ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటవుతున్నాయి, హార్సిలీహిల్స్‌పై ఎల్‌ఈటీ లైట్ల కథ ఎలా రాత్రయితే చీకటి కమ్ముకుంటోంది. సముద్ర మట్టానికి 4,141 అడుగుల ఎత్తులోని ఈ పర్యాటక కేంద్రానికి వెలుగుల మోక్షం ఎప్పుడు అన్నది ఎదురుచూపే అవుతోంది.

చీకటిలోనే మగ్గిపోతోంది

చుట్టూ అటవీప్రాంతం కలిగిన కొండపై విష సర్పాలు, దుప్పులు, జింకలు సంచరిస్తుంటాయి. వీటి బారిన పడితే స్థానికులకు ప్రాణాపాయం తప్పదు. ముఖ్యంగా వీధిదీపాల ఏర్పాటు జరగడం లేదు. రోడ్ల వెంబడి ఉన్న విద్యుత్‌ స్థంభాలకు వీధి దీపాలను ఏర్పాటు చేస్తే వెలుగు ఉంటుంది. సందర్శకులు, స్థానికులకు ఇబ్బందులు ఉండవు. 20 ఏళ్ల క్రితం కొండపైనున్న అక్కడక్కడా వీఽధిదీపాలు ఏర్పాటు చేసి వదిలేశారు. అప్పుడు వేసిన లైట్లు ఇప్పుడు లేవు. స్తంభాలకు పైపులు అలాగే కనిపిస్తున్నాయి. వాటికి లైట్లను అమర్చితే ప్రయోజనం. పర్యాటక ప్రాంతమైన హార్సిలీకొండకు ప్రభుత్వస్థాయి అధికారులు, ముఖ్యనేతలు రాకపోకలు సాగించే ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి అధికంగా పొరుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు వస్తుంటారు. ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తే వీరికి సౌకర్యం కల్పించడమేకాక స్థానికులకు ఇబ్బందులు తొలగుతాయి.

సమావేశాలు ఎప్పుడు

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మూడునెలలకోసారి హార్సిలీహిల్స్‌ టౌన్‌షిప్‌ కమిటీ సమావేశాలు జరిగేవి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్క సమావేశం కూడా జరగలేదు. దీంతో హార్సిలీహిల్స్‌పై ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ఇకనైనా టౌన్‌షిప్‌ కమిటీ సమావేశాలు నిర్వహిస్తే ఎన్నో సమస్యలు పరిష్కారం అయ్యేందుకు వీలుంది.

దిష్టిబొమ్మల్లా హైమాస్‌

అంతా అగమ్యగోచరం

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.14.75 లక్షలతో ఐదు చోట్ల వాటిని ఏర్పాటు చేయించారు. 16 మీటర్ల ఎత్తులో గాలిబండపై రెండు చోట్ల, ఏనుగుమల్లమ్మ ఆలయం వద్ద ఒకటి, జిడ్డు సర్కిల్‌లో ఒకటి, రెవెన్యూ అతిథి గహం వద్ద ఒకటి ఏర్పాటు చేశారు. ప్రారంభంలో అన్ని లైట్లు వెలుగుతూ ఎక్కడో ఉన్న వారికి ఈ లైట్ల వెలుగు కనిపించేది. అదిగో హార్సిలీహిల్స్‌పై లైట్లు అని చెప్పుకునేవారు. ప్రస్తుతం స్వీమ్మింగ్‌ పూల్‌, రెవెన్యూ అతిథి భవనం వద్ద మాత్రమే హైమాస్‌ లైట్లు వెలుగుతున్నాయి. మిగిలిన మూడు వృధాగా ఉన్నాయి.

వెలుగులు ఎప్పుడు? 1
1/2

వెలుగులు ఎప్పుడు?

వెలుగులు ఎప్పుడు? 2
2/2

వెలుగులు ఎప్పుడు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement