టీ హోటల్‌లో పేలిన గ్యాస్‌ సిలిండర్‌ | - | Sakshi
Sakshi News home page

టీ హోటల్‌లో పేలిన గ్యాస్‌ సిలిండర్‌

Mar 23 2025 12:23 AM | Updated on Mar 23 2025 12:23 AM

టీ హో

టీ హోటల్‌లో పేలిన గ్యాస్‌ సిలిండర్‌

కురబలకోట : మండలంలోని అంగళ్లు బస్టాప్‌ పక్కన ఉన్న టీ హోటల్‌లో శనివారం ఉదయం ఎల్‌పీజీ గ్యా స్‌ సిలిండర్‌ పేలింది. పెద్ద ఎత్తున శబ్దం రావడంతో పరిసర ప్రాంతాల వారు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అదీ అంగళ్లు బస్టాప్‌ దగ్గరే ఇలా జరగడంతో కల కలాన్ని సృష్టించింది. రూ. 50 లక్షల దాకా నష్టం వాటిల్లి ఉంటుందని భావిస్తున్నారు. ఉదయం ఆరు గంటల ప్రాంతంలో కాబట్టి జన సంచారం పెద్దగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే నిత్యం జనాలతో రద్దీగా ఉండే బస్టాఫ్‌ ప్రాంతంలో పెద్ద ప్రమాదం సంభవించి ఉండేది. సిలిండర్‌ పేలడంతో టీ హోటల్‌ భవనం కుప్పకూలింది. ఇరుగుపొరుగున వున్న భవనాలు కూడా కదిలాయి. గ్యాస్‌ లీక్‌ కావడ మే ఈ ఘటనకు కారణంగా భావిస్తున్నారు. జిల్లాలో సంచలనం కల్గించిన ఈ దుర్గటనకు సంబంధించి బాధితుడితో పాటు పరిసర ప్రాంతాల వారి కథనం మేరకు..కదిరి ప్రాంతం తనకల్లుకు చెందిన కృష్ణయ్య (52) రెండేళ్లుగా అంగళ్లు బస్టాప్‌ వద్ద అద్దె రూములో ఓ ప్రాంచైజీస్‌ టీ హోటల్‌ నిర్వహిస్తున్నాడు. యథావిధిగా శనివారం ఉదయం టీ హోటల్‌ తెరచి స్టవ్‌ వద్దకు వెళ్లి లైటర్‌తో గ్యాస్‌ వెలిగించాడు. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కృష్ణయ్య దుస్తులు అంటుకుని ఒంటికి మంటలు వ్యాపించాయి. భవనమంతా పెద్ద ఎత్తున పొగలు కమ్మాయి. ఆయన కాలుతున్న మంటలతో రోడ్డుపైకి రావడంతో స్థానికులు వెంటనే ఆయన ఒంటిపై మంటలను ఆర్పివేశారు. ఆయన బయటకు వచ్చిన వెంటనే పెను శబ్దం రావడంతో ఒక్కసారిగా టీ హోటల్‌ భవనం కుప్పకూలింది. కృష్ణయ్య ముందుగా బయటకు రావడంతో తీవ్ర గాయాలతో బయటపడ్డారు. లేదంటే బండల కింద ఊహించని ప్రమాదం సంభవించి ఉండేది. సంఘటన విషయం తెలుసుకున్న ఫైరింజన్‌ హుటాహుటిన అంగళ్లుకు చేరుకుంది. అప్పటికే సంఘటన జరిగిపోయింది. బాధితుడు కృష్ణయ్యను హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

పెద్ద శబ్దంతో ఉలిక్కిపడ్డాం

సంఘటన జరిగిన టీ హోటల్‌ పక్కనే మా ఎరువుల అంగడి ఉంది. శనివారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. ఉలిక్కి పడ్డాం. మాషాపు ఉన్న భవనం కూడా అదిరింది. కిందకు వచ్చి చూస్తే టీ హోటల్‌ భవనం కుప్పకూలిపోయింది. పైగా బస్టాప్‌ ప్రాంతంలో ఇది జరగడం ఉదయం వేళ కావడంతో జన సంచారం పెద్దగా లేకపోవడంతో పెను ప్రమాదమేతప్పింది. పరిసర ప్రాంతాల వారు ఒక్కసారిగా భయంతో వణికిపోయారు.

– కనసాని వేణుగోపాల్‌రెడ్డి,

ఫర్టిలైజర్‌ షాపు యజమాని, అంగళ్లు

హోటల్‌ నిర్వాహకుడికి తీవ్ర గాయాలు

రూ. 50 లక్షల ఆస్తి నష్టం

ఉలిక్కి పడిన అంగళ్లు

టీ హోటల్‌లో పేలిన గ్యాస్‌ సిలిండర్‌ 1
1/2

టీ హోటల్‌లో పేలిన గ్యాస్‌ సిలిండర్‌

టీ హోటల్‌లో పేలిన గ్యాస్‌ సిలిండర్‌ 2
2/2

టీ హోటల్‌లో పేలిన గ్యాస్‌ సిలిండర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement