రాయచోటి అర్బన్ : ఉపాధి హామీపథకం పనులను వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని అసెంబ్లీ సమావేశాలలో చెప్పడం చట్ట స్ఫూర్తికి విరుద్ధమని సీపీఐ అనుబంధ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పండుగోలు మణి, తోపుక్రిష్ణప్ప, సీపీఐ జిల్లా కార్యదర్శి పియల్ నరసింహులు అన్నారు. శుక్రవారం పట్టణంలోని సీపీఐ కార్యా లయంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య ససమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుబంధ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కష్టజీవులు అంగీకరించబోరంటూ హెచ్చరించారు. రాష్ట్రబడ్జెట్‌లో ఒక్కరూపాయిని కూడా కేటాయించని ప్రభుత్వా నికి ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అను సంధానం చేసే నైతికహక్కు లేదన్నారు. అనుసంధానం పేరుతో కూలీలకు ద్రోహం తలపెట్టవద్దంటూ వారు కోరారు. కరువు పరిస్థితులతో తల్లడిల్లుతూ తిండిఅయినా పెట్టండి – పనులు అయినా కల్పించండి అనే నినాదంతో పేదలు, కూలీలు చేసిన పోరాటం ఫలితంగానే 2005లో యూపీఏ ప్రభుత్వం ఉపాధిహామీ చట్టం తీసుకువచ్చిందన్నారు. ఉపాధిపనులను సక్రమంగా కల్పించకపోవడం వలన కూలీల వలసలు తీవ్రమయ్యాయన్నారు. ఉపాధిహామీ పథకం నిధులను పక్కదారి పట్టించకుండా చూడాలన్నారు. మెటీరియల్ కాంపోనెంటును పూర్తిగా రాష్ట్రప్రభుత్వమే భరించాలని కోరారు. కూలీలకు డబ్బులను పోస్టాపీసు ద్వారా చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న పాతబకాయిలను తక్షణమే చెల్లించాలన్నారు. ఉపాధిహామీ పథకం ద్వారా పనిచేస్తున్న ప్రతి వ్యక్తికి ఉపాధి కల్పించాలని, ఒకవేళ పని కల్పించలేకపోతే వారికి ఉపాధి భృతిగా ఏడాదికి రూ.12 వేల చొప్పున అందజేయాలని కోరారు. సమావేశంలో రైల్వేకోడూరు, రాజంపేట ,తంబళ్ళపల్లె, మదనపల్లె, పీలేరు,రాయచోటి ప్రాంతాల సంఘం నేతలు పాల్గొన్నారు.
ఉపాధిని వ్యవసాయానికి
అనుసంధానం చట్టస్ఫూర్తికి విరుద్ధం
పనులు కల్పించలేకపోతే ఏడాదికి
రూ.12వేల భృతిగా చెల్లించాలి
ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నేతల డిమాండ్