రైల్వేకోడూరు అర్బన్ : మండలంలోని కొత్తపల్లి గ్రామంలో రాజకీయ కారణాలతో అగ్రవర్ణ భూస్వాములు కంచె వేసి దారిని ఆక్రమించారని, హైకోర్టు ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు రైతులకు దారి ఏర్పాటు చేయాలని శుక్రవారం సీపీఎం నాయకుడు సిహెచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2016వో ఎన్నో ఏళ్లుగా ఉన్న దారిని మూసేశారని, అప్పటి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వగా స్టే తెచ్చారని వారు పేర్కొన్నారు. దానిపై ప్రస్తుతం హైకోర్టు స్టే రద్దు చేసి నాలుగు వారాలలో దారి ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించిందన్నారు. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు రాజకీయ నాయకుల అండదండలతో పట్టించుకోవడం లేదని వారు పేర్కొన్నారు. నిర్లక్ష్యం వీడి రైతులకు దారి ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మల్లికార్జున రెడ్డి, సుభాన్ బాష, రాజగోపాల్ రెడ్డి, ఓబిలి పెంచలయ్య, బొజ్జా శివయ్య, ఆనంద్, పెంచలయ్య, కేశవులు, నారాయణ, చలపతి, శ్రీను, చిన్నమ్మ, చెంగమ్మ తదితరులు పాల్గొన్నారు.