నా పేరు మనోహర్. రాయచోటి రూరల్ మండలం ఎండపల్లి. 15 ఏళ్ల కిందట మామిడిచెట్లు నాటి పెంచుకుంటున్నాను. గుర్తుతెలియని వ్యక్తులు కొందరు నిప్పంటించడంతో 50 మామిడి చెట్లు కాలిపోయాయి. 15 ఏళ్లుగా పెంచుకున్న చెట్లు కాలిపోవడంతో ఆర్థికంగా ఇబ్బందిపడ్డాను. తిరిగి ఆ చెట్లను పెంచాలంటే మరో 15 ఏళ్లు ఆగాల్సిందే. ఆకతాయిలు, పశువుల కాపర్లు కానీ అగ్గి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
● అగ్గి మంటలకు బుగ్గిపాలు అవుతున్న పంటలు, అడవులు
● 430 అగ్ని ప్రమాదాలు.. రూ.3.5 కోట్ల ఆస్థి నష్టం
● అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ సాధ్యమంటున్న అగ్నిమాపక అధికారులు