అడవుల సంరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

అడవుల సంరక్షణ అందరి బాధ్యత

Mar 22 2025 1:29 AM | Updated on Mar 22 2025 1:25 AM

ఒంటిమిట్ట: అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఒంటిమిట్ట ట్రైనీ ఐఎఫ్‌ఎస్‌ అధికారి శ్రీకాంత్‌ అన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ సాయి భారతి ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అడవులు ప్రాముఖ్యత, వాటి సంరక్షణ అవసరం, అటవీ చట్టాల పాత్ర తదితర అంశాల గురించి ఆయన వివరించారు. అనంతరం శ్రీకాంత్‌ మాట్లాడుతూ అడవులు వాతావరణ సమతుల్యతను కాపాడతాయన్నారు. అడవుల వినాశనం పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి వాటిని రక్షించేందుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు, స ర్టిఫికెట్లు అందజేశారు.కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్‌ రామ తులసీ, ఎఫ్‌ఎస్‌ఓ బ్రహ్మయ్య, ప్రిన్సిపాల్‌ సుబ్బరామయ్య, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement