
బాలుడికి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు
నందలూరు : ‘మా బిడ్డను కాపాడండయ్యా’ శీర్షికన బుధవారం సాక్షిలో ప్రచురితమైన వార్తపై అధికారులు స్పందించారు. మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ నాగిరెడ్డిపల్లి దళితవాడకు చెందిన నాయనపల్లి హరిప్రసాద్, స్వర్ణలత దంపతుల కుమారుడు నవీన్ తేజ (14) గుండె జబ్బుపై కథనం ప్రచురితమైన విషయం విదితమే. నందలూరు ప్రభుత్వ వైద్యాధికారులు శరత్ కమల్, కార్తీక్ విశ్వనాథ్, ఏఎన్‌ఎం నాగలక్ష్మీ బాధితుని ఇంటికి వెళ్లి నవీన్ తేజ తల్లిదండ్రులతో మాట్లాడారు. విషయాన్ని అన్నమయ్య జిల్లా ఎన్టీఆర్ వైద్య సేవ డిస్ట్రిక్ట్ కో–ఆర్డినేటర్ లోకవర్దన్‌కు వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నవీన్ తేజను ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు తరపున సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు పంపించి అవసరమైన చికిత్స చేయిస్తామని వారు తెలిపారు.

బాలుడికి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు