నా పేరు టి.నందిని, మేము మండల కేంద్రమైన గాలివీడు టౌన్ చిలకలూరిపేటలో నివసిస్తున్నాం. 2024 నవంబర్ ఆరో తేదీన నా భర్త హరినాథ్ పక్కిరవాండ్లపల్లి సమీపంలో మామిడి తోటలో ట్రాక్టర్ మిల్లరులో పడి మృతి చెందాడు. దీనికి కారణమైన వారు అరవిటి వాండ్లపల్లిలో ఉన్నారు. దాదాపు 5 నెలలు కావస్తున్నా నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. నేను నా పిల్లలు కలిసి చనిపోవడానికి సిద్ధమవుతున్నాము. మా కుమార్తె సాహితీకి నాలుగేళ్లు, కుమారుడు జన్నేశ్వర్‌కు ఏడాది.. నా పరిస్థితి బాగా లేకనే ఇంత దూరం ఇద్దరి పిల్లల్ని వేసుకొని అధికారుల దగ్గరికి వచ్చా.. కనీసం మానవత్వంతో అన్న న్యాయం చేస్తారని కలెక్టర్‌కు సార్ విన్నవించుకోగా .. ఆయన గాలివీడు పోలీసులకు ఫోన్ చేసి అవతలి వ్యక్తి మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని చెప్పారు.. నేను ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను. న్యాయం కోసమే ఇక్కడికి వచ్చాను.