మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి చర్యలు

Mar 17 2025 3:03 AM | Updated on Mar 17 2025 11:24 AM

కడప సెవెన్‌రోడ్స్‌ : జిల్లాలోని మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మేజర్‌ జనరల్‌ అజయ్‌మిశ్రా అన్నారు. ఆదివారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన మాజీ సైనికుల మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమావేశానికి భారీ సంఖ్యలో హాజరైన మాజీ సైనికులు, వారి కుటుంబాలకు చెందిన వ్యక్తులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మేజర్‌ జనరల్‌ అజయ్‌మిశ్రా, బ్రిగేడియర్‌ వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని చిన్న సమస్యలను అక్కడే పరిష్కరించారు. కల్నల్‌ మాథ్యూ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మాజీ సైనికులకు పరీక్షలు నిర్వహించి ఉచిత వైద్య సేవలు అందించారు. వైఎస్సార్‌, అన్నమయ్య జిల్లాలకు చెందిన తొమ్మది మంది దివంగత సైనికుల సతీమణులను ఘనంగా సత్కరించారు. వారికి చీర, మెమెంటో, సెమీ ఆటోమేటిక్‌ వాషింగ్‌ మిషన్లు బహూకరించారు. అలాగే తొమ్మిది మంది మాజీ సైనికులకు ట్రై ప్యాడ్‌, వాకింగ్‌ స్టిక్స్‌, ఐదుగురికి వీల్‌ చైర్లు అందజేశారు.

మేజర్‌ జనరల్‌ అజయ్‌మిశ్రా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement