నేను చాలా సార్లు తూనికలు, కొలతలకు సంబంధించి వ్యత్యాసాలు చూశాను. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల వ్యాపారులు ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు వ్యవహరించి మోసం చేస్తున్నారు. గతంలో కొలతల రాళ్ల (ఇనుముతో ఉండేటివి) కు కింద భాగంలో సీసం ఉండేది. వాటి స్థానంలో ఎలక్ట్రానిక్ మిషన్లు వచ్చిన తరువాత తూకాల్లో కచ్చితత్వం ఉంటుందని అనుకొన్నారు. వాటిలో కూడా ముందుగా తూకం సరిచేసి సిద్ధం చేసి ఉంచుకొంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వీటిలో ప్రభుత్వ చౌక దుకాణాలలో ఎక్కువగా మోసం చేస్తున్నారు. –కె. జీవానందం, రాయచోటి