తక్కువ తూకం..నాణ్యత లోపం..గడువుకు ముందే దెబ్బతినడం.. నిర్లక్ష్యసమాధానం.. బాధ్యతారాహిత్యం.. నిత్యావసర వస్తువుల మొదలు అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాల వరకు ముందు..వెనుక దగా..తాగే నీళ్లు, పాలలో కూడా నాణ్యత లేకుండా పోయింది. తూకాల్లో భారీగా తేడాలు ఉన్నాయి. చివరకు నష్టపోయేది వినియోగదారుడే. వీటిపై ఎవరైనా ప్రశ్నిస్తే తప్ప న్యాయం జరగడం లేదు. ఈ తరహా మోసాలను అరికట్టాలంటే వినియోగదారులు మేలుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.కొనుగోలుదారుడికి రక్షణగా చట్టం ఉంది.మనం చేయాల్సింది వినియోగించుకుని మేలుకోవడమే. నేడు (మార్చి 15) ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం.
రాయచోటి: జిల్లా కేంద్రం రాయచోటిలోని వీధుల్లో తిరుగుతున్న బండిపై ఓ మహిళ వంద రూపాయలకు 4 కిలోల ఉల్లిపాయలు కొనుగోలు చేసింది. వ్యాపారి ఎలక్ట్రానిక్ యంత్రంపై తూకం వేసి ఇచ్చాడు. అనుమానం రావడంతో పక్కనే ఉన్న దుకాణంలో నాలుగు కిలోల ఉల్లిగడ్డలను తూకం వేసి పరీక్షించింది. 600 గ్రాములు తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. జిల్లా కేంద్రంలో ఇలా ప్రతి రోజు వినియోగదారులు వ్యాపార కేంద్రాలలో ఏదో విధంగా మోసాలకు గురవుతూ వస్తున్నారు. ఆటో, తోపుడు బండిలలోనే కాకుండా చిల్లర దుకాణాలు, చౌకదుకాణాలు, ఫర్టిలైజర్స్ షాపులు, కూల్‌డ్రింక్స్, మందులు, మాత్రలు, సంతలలో ఇలాంటి మోసాలు అధికంగా కనిపిస్తున్నాయి.
అధిక ప్రాధాన్యత
కస్టమర్లకు వ్యాపార సంస్థలు సైతం ఎక్కువ ప్రాధాన్యతను అందిస్తాయి. మార్కెట్లో వినియోగదారులు సరసమైన ధరలతో పాటు స్వచ్ఛమైన, నాణ్యమైన ఉత్పత్తులను కోరుకుంటుంటారు. వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు వినియోగదారుల చట్టం ఉంది.ఇందులో ప్రాథమిక హక్కులను కల్పించింది.
సమాచార హక్కు
ఏదైనా ఉత్పత్తి గురించి కావాల్సిన సమాచారాన్ని తెలుసుకునే హక్కు వినియోగదారులకు చట్టం కల్పించింది. ఉదాహరణకు ప్రొడక్ట్ నాణ్యత, పరిమాణం, ధర, క్వాలిటీ, ఎక్స్‌పైరీ తేదీ వంటి వివరాలను అడిగి తెలుసుకోవచ్చు. వినియోగదారుల చట్టం ప్రకారం.. కస్టమర్లు తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించే హక్కును కలిగి ఉంటారు. కస్టమర్ కొనుగోలు చేసిన ఉత్పత్తిపై ఏదైనా లోపం ఉంటే అభ్యంతరం తెలియజేయవచ్చు. కస్టమర్ తాము మోసపోయామని భావిస్తే.. వారు వినియోగదారుల ఫోరమ్‌లో సదరు వ్యాపార సంస్థ లేదా కంపెనీపై ఫిర్యాదు చేయవచ్చు.
ఫిర్యాదుల
పరిష్కారం
తమకు మోసం జరిగితే అది ఉత్పత్తి ప్రొఫెషనల్ లేదా కంపెనీకి సంబంధించిన ఫిర్యాదైనా వినియోగదారు చట్టం ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు. వినియోగదారుల ఫోరం లేదా వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కేంద్రం దీనిని పరిష్కరిస్తుంది.
సిబ్బంది కొరత
జిల్లాలో తూనికలు, కొలతల శాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. జిల్లా అధికారితో పాటు, టెక్నికల్ అసిస్టెంట్, అటెండర్ మరో కానిస్టేబుల్ అవసరం ఉంది. ఇప్పటి వరకు వారిని నియమించకపోవడంతో తగిన రీతిలో దాడులు చేయలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి.
అందుబాటులో హెల్ప్‌లైన్
వినియోగదారుడికి హక్కులపై అవగాహన కల్పించి మోసపోకుండా ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా వినియోగదారుల మేళాలు, శిబిరాలు, వర్క్‌షాప్‌లను కూడా నిర్వహిస్తోంది. వినియోగదారుల హక్కుల కోసం దేశంలో హెల్ప్‌లైన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. కస్టమర్లు తన ఫిర్యాదును నేషనల్ కన్సూమర్ హెల్ప్‌లైన్ 1800114000 టోల్‌ఫ్రీ నంబర్‌లో నమోదు చేయవచ్చు.
నిలువు దోపిడీ చేస్తున్న వ్యాపారులు
అధిక ధరకు అమ్మకాలు
నాణ్యతా, ప్రమాణాలు పాటించని వైనం
నష్టపోతున్న వినియోగదారులు
ఫిర్యాదులుంటేనే చర్యలంటున్న అధికారులు
సేఫ్ షాపింగ్ అనేది వినియోగదారుడి ఉన్న ప్రధాన హక్కు. కొనుగోలు చేసిన ఉత్పత్తి భద్రతకు తయారీదారు బాధ్యత వహించాలి. మార్కెట్లో సెల్లర్స్ ఎల్లప్పుడూ నాణ్యమైన వస్తువులను విక్రయించాలి. వినియోగదారులు కూడా నాణ్యమైన ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. ఐఎస్‌ఐ మార్క్, ఐఎస్‌ఓ సర్టిఫైడ్ ఉత్పత్తులను ఉపయోగించాలి. వస్తువుల నాణ్యత, దానితో పాటు సేవల గురించి సమాచారాన్ని పొందే హక్కు వినియోగదారులకు చట్టం కల్పించింది. ఏ కంపెనీకి చెందిన ఉత్పత్తిని కొనుగోలు చేయాలనే హక్కును కస్టమర్లకు చట్టం కల్పించింది. షాపింగ్ సమయంలో కస్టమర్ల నిర్ణయానికి విరుద్ధంగా వేరే బ్రాండ్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని వ్యాపారి బలవంతం చేసినట్లయితే వినియోగదారులు దీనిపై ఫిర్యాదు చేసేందుకు చట్టం వెసులుబాటు కల్పించింది.
భద్రత హక్కు
భద్రత హక్కు
భద్రత హక్కు
భద్రత హక్కు