మంత్రి రాంప్రసాద్‌రెడ్డికి పీడీఎస్‌యూ నేతల వినతి
రాయచోటి అర్బన్ : ఎంబీబీఎస్ విద్యార్థులతో సమానంగా పశువైద్య విద్యార్థులకు గౌరవ వేతనం చెల్లించే విధంగా చర్యలు తీసుకుని న్యాయం చేయాలని పీడీఎస్‌యూ నాయకులు అంకన్న డిమాండ్ చేశారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డిని శుక్రవారం వారు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అంకన్న మాట్లాడుతూ 2013 వరకూ రాష్ట్రంలో పశు వైద్య విద్యార్థులకు రూ.5 వేల గౌరవవేతనం అందించామన్నారు. ప్రస్తుతం ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు రూ.25వేల గౌరవ వేతనం అందిస్తున్నారని, పశు వైద్య విద్యార్థులపై మాత్రం వివక్ష చూపుతున్నారన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చి పశు వైద్య విద్యార్థులకు రూ.25వేల గౌరవ వేతనం అందించాని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ ఉమ్మడి జిల్లా నేతలు రవీంద్ర, మ హేష్, చిన్నారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగులకు అండగా ఉంటాం
ఉద్యోగులకు అన్ని రకాలుగా అండగా ఉంటానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల ఎన్నికై న ఏపీ ఎన్‌జీఓ జిల్లా నూతన కార్యవర్గ సభ్యులు శుక్రవారం మంత్రిని ఆయన స్వగృహంలో కలిసి సమస్యలను విన్నవించారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేలా చూస్తానన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులైన లబ్ధిదారులకందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్‌జీఓ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.ప్రసాద్‌యాదవ్, కడప జిల్లా అధ్యక్షుడు బి.శ్రీనివాసులు, జాయింట్ సెక్రటరీ నరసింహారెడ్డి, శ్రీనివాసన్, పద్మనాభం, బలరామరాజు, వెంకటేశ్వరరెడ్డి, ఆర్.జయచంద్ర, తదితరులు పాల్గొన్నారు.