మదనపల్లె సిటీ/రాజంపేటటౌన్: హోలీ..అందరిలో ఉత్సాహం నింపుతుంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ రంగుల్లో మునిగి తేలుతుంటారు. నాటితరం జరుపుకొనే వేడుకలకు నేటి యువత చేసుకుంటున్న సంబరాలకు పోలిక ఉండటం లేదు. గతంలో సహజ రంగులతో హుందాగా జరపుకుంటే.. నేడు రసాయనాలతో తయారు చేసిన రంగులు పూసుకుంటున్నారు. ప్రస్తుతం వాడుతున్న రంగుల్లో ప్రమాదకరమైన క్రోమియం, అల్యూమినియం, మెర్క్యురీ ఆకై ్సడ్‌లు కలుస్తున్నాయి. ఇలాంటి సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ’రంగుపడుద్డి‘అని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
ఇలా చేద్దాం
పలు రకాల పూలు, పండ్లతో ఇళ్లల్లోనే సహజసిద్ధమైన రంగులు తయారు చేసుకోవచ్చు. వీటితో చర్మానికి మేలు కలగగడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు. ఎర్ర గులాబీ, మందారం పూలు, ఎర్రచందనం, టమటా గుజ్జు, క్యారెట్, బీట్‌రూట్‌లతో ఎరుపు రంగు తయారవుతుంది. పసుపు పొడి, తంగేడు,బంతి, చామంతి,తుమ్మపూలతో పసుపురంగు ద్రావకం సిద్ధమవుతుంది. వేసవిలో విరివిగా లభించే మోదుగ పూలతో కాషాయరంగు ద్రావణం తయారు చేసుకోవచ్చు. ఎండిన గోరింటాకు పొడి లేదా పచ్చి గోరింటాకు, పాలకూర, పుదీనా, కొత్తిమీర వంటి ఆకుకూరలను మెత్తగా రుబ్బి నీరు కలిపితే ఆకుపచ్చ రంగు తయారు చేసుకోవచ్చు.
చిన్నపిల్లలను దూరంగా ఉంచాలి
హోలీ అంటే చిన్నపిల్లల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. రంగులు ఎలా చల్ల్లుకో వాలో వారికి తెలియదు. నోరు, ముక్కుల్లోకి పోయే అవకాశం ఉంది. దీంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. పిల్లలను హోలీకి దూరంగా ఉంచాలి. – వీరయ్య, వైద్యులు, రాజంపేట
కళ్లల్లో పడితే ప్రమాదం
మార్కెట్‌లో లభిస్తున్న రంగుల్లో రసాయనాలు కలుస్తున్నాయి. ఇవి కళ్లల్లో పడితే కంటి చూపునకే ప్రమాదం. కళ్లకు రక్షణగా అద్దాలు ధరించాలి. కళ్లల్లో రంగుపడితే వెంటనే నీటితో కడిగి వైద్యున్ని సంప్రదించాలి. –వెంకటరామయ్య, వైద్యులు
ఇవీ సూచనలు
హోలీ ఆడటానికి ముందు శరీరానికి మాయిశ్చరైజర్‌ని, తలకు నూనెను రాసుకోవాలి. దీనివల్ల రంగులు శరీరంలోకి ఇంకవు. ముఖంపై పడిన రంగులను శుభ్రం చేసుకోవడానికి సబ్బు కన్నా డ్లైన్సింగ్ మిల్క్ ఉత్తమమైనది. చాలా మంది హోలీ ఆడే సమయంలో రంగులలో ఆయిల్స్ కలుపుతారు. ఈకారణంగా రంగులను శుభ్రం చేసుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. రంగుల్లో ఎలాంటి నూనెలు, నీళ్లు కలపకుండా చల్లుకుంటే మంచిది.
జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్య హోలీ
తేడా వస్తే ‘రంగుపడుద్ది’
తేడా వస్తే ‘రంగుపడుద్ది’
తేడా వస్తే ‘రంగుపడుద్ది’