జేసీ ఆదర్శ రాజేంద్రన్
మదనపల్లె : హైవే నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయమైన పరిహారం అందించేందుకు కృషి చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ అన్నారు. బుధవారం మండలంలోని తట్టివారిపల్లె వద్ద నేషనల్ హైవే భూసేకరణకు సంబంధించి నిర్వాసితులతో మాట్లాడారు. హైవే నిర్మాణానికి సహకరించాల్సిందిగా కోరారు. తర్వాత పోతబోలు పంచాయతీలో ఎంఐజీ లే అవుట్ కోసం రెవెన్యూ అధికారులు ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించారు. స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక అందించాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారు. అనంతరం పీకేఎం–ఉడా కార్యాలయంలో చైర్‌పర్సన్ హోదాలో కార్యకలాపాలపై సమీక్షించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, తహసీల్దార్ ధనంజయులు, మున్సిపల్ కమిషనర్ కె.ప్రమీల, పీకేఎం–ఉడా సిబ్బంది మధు, సంధ్య తదితరులు పాల్గొన్నారు.