రాయచోటిలో అనసూయ సందడి | Sakshi
Sakshi News home page

రాయచోటిలో అనసూయ సందడి

Published Fri, Nov 17 2023 1:34 AM

షాపింగ్‌ మాల్‌లో రంగు రంగుల చీరలతో 
సందడి చేస్తున్న యాంకర్‌ అనసూయ     - Sakshi

ఘనంగా ఎంజీఆర్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవం

రాయచోటి: పట్టణంలోని ఎంజీఆర్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవంలో యాంకర్‌ అనసూయ సందడి చేశారు. రాయచోటిలో గురువారం ఎంజీఆర్‌ షాపింగ్‌ మాల్‌ను ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో షాపింగ్‌ మాల్‌ ఎదుట ప్రదర్శన చేసి ప్రజలను ఆకట్టుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాయచోటిలో ఏర్పాటు చేసిన షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. అనసూయను చూసేందుకు పట్టణ ప్రజలు భారీగా తరలివచ్చారు.

షాపింగ్‌ మాల్స్‌ ఏర్పాటు హర్షనీయం

అన్నమయ్య జిల్లా కేంద్రంలో షాపింగ్‌ మాల్‌ ఏర్పాటు కావడం హర్షనీయమని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. రాయచోటి పట్టణంలోని ఎస్‌ఎన్‌ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంజీఆర్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌ భాషతో కలిసి ముఖ్య తిథిగా ఎమ్మెల్యేశ్రీకాంత్‌ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement