సాక్షి, తాడేపల్లి: దివంగత మాజీ సీఎం నీలం సంజీవరెడ్డికి వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్‌వేదికగా ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్‌లో ‘భారత రాజకీయాల్లో నిష్కళంక ప్రజాసేవకు, విలువలతో కూడిన నాయకత్వానికి ప్రతీకగా నిలిచిన గొప్ప నాయకుడు నీలం సంజీవరెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించి..లోక్‌సభ స్పీకర్‌గా ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించి.. భారత రాష్ట్రపతిగా దేశ అత్యున్నత పదవికి గౌరవం తీసుకొచ్చిన ఆయన సేవలు చిరస్మరణీయం.నేడు నీలం సంజీవరెడ్డి గారి జయంతి సందర్భంగా నివాళులు’ అని పేర్కొన్నారు.
భారత రాజకీయాల్లో నిష్కళంక ప్రజాసేవకు, విలువలతో కూడిన నాయకత్వానికి ప్రతీకగా నిలిచిన గొప్ప నాయకుడు నీలం సంజీవరెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించి, లోక్‌సభ స్పీకర్‌గా ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించి, భారత రాష్ట్రపతిగా దేశ అత్యున్నత… pic.twitter.com/ACFVKQHcEN
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 19, 2026


