
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సెపె్టంబర్ 1 నుంచి మూడు రోజుల పాటు వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సోమవారం మధ్యాహ్నం పులివెందుల చేరుకుని భాకరాపురంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. 2వ తేదీ ఉదయం ఇడుపులపాయకు చేరుకుంటారు.
అక్కడ వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు. ఆ తర్వాత లింగాల మండలం అంబకపల్లి చేరుకుని గంగమ్మ కుంట వద్ద జల హారతి కార్యక్రమంలో పాల్గొంటారు.
అనంతరం పులివెందుల చేరుకుని క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. 3వ తేదీ ఉదయం పులివెందుల నుంచి తిరుగు పయనమవుతారు. ఈ మేరకు శనివారం వైఎస్సార్‌సీపీ ఒక ప్రకటన విడుదల చేసింది.