భర్త గ్యాస్‌ తేలేదని భార్య ఆత్మహత్యాయత్నం | wife and husband gas cylinder issue in anantapur | Sakshi
Sakshi News home page

భర్త గ్యాస్‌ తేలేదని భార్య ఆత్మహత్యాయత్నం

Mar 30 2026 8:04 AM | Updated on Mar 30 2026 10:40 AM

wife and husband gas cylinder issue in anantapur

అనంతపురం జిల్లా: భర్త గ్యాస్‌ సిలిండర్‌ తీసుకురావడం లేదని మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్యకు ప్రయతి్నంచింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడులో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలిలా.. తొండపాడులో హరికృష్ణ, మహాలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. ఇంట్లో గ్యాస్‌ అయిపోవడంతో సిలిండర్‌ తేవాలని మహాలక్ష్మి మూడు నెలలుగా భర్తకు చెబుతోంది. డబ్బులు లేవన్న కారణంతో అతను సిలిండర్‌ తీసుకురాలేదు. 

కట్టెల పొ­య్యి­పై వంట చేస్తోంది. అయితే డబ్బులు అందడంతో హరికృష్ణ గ్యాస్‌ కోసం గుత్తి పట్టణానికి వెళ్లాడు. అక్కడ సిలిండర్‌ దొరకలేదు. తాను ఎంత చెప్పినా భర్త గ్యాస్‌ సిలిండర్‌ తేవడం లేదన్న మనస్తాపంతో మహాలక్ష్మి ఆదివారం ఇంట్లో ఫినాయిల్‌ తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను భర్త, కుటుంబసభ్యులు  గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  పరిస్థితి నిలకడగా ఉంది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement