వ్యవస్థను భ్రష్టుపట్టించి ఆర్తనాదాలు చేస్తే ఎలా?: విజయసాయి రెడ్డి

Vijayasai Reddy Tweet On Misuse Of Temple Lands By Ashok Gajapathi Raju - Sakshi

సాక్షి, అమరావతి: మాన్సాస్ వేలం పేరుతో జరిగిన భూమాయ బయటపడుతోందని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి అన్నారు. విజిలెన్స్ విచారణలో పూసపాటి అశోక్ ముసుగు తొలగిపోయిందని ఆయన మంగళవారం ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘‘మాన్సాస్ వేలం పేరుతో జరిగిన భూమాయ బయటపడుతోంది. విజిలెన్స్ విచారణలో పూసపాటి అశోక్ ముసుగు తొలగిపోయింది. దేవాదాయశాఖ అనుమతి లేకుండా ప్రైవేట్ వెబ్ సైట్ క్రియేట్ చేసి వేలం వేశారంటేనే అసలు ఉద్దేశమేంటో అర్థమైపోతుంది. వ్యవస్థను భ్రష్టుపట్టించి ఇప్పుడు ఆర్తనాదాలు చేస్తే ఉపయోగం ఏంటి రాజా?’’ అని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

చదవండి: ప్రేమ ఒకరితో.. పెళ్లి మరొకరితో.. పెళ్లి దుస్తుల్లోనే..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top