విశాఖ జాబ్‌ మేళాకు భారీ స్పందన

Unemployees Attended The Visakha Job Fair In Large Numbers - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఆంధ‍్ర యూనివర్సిటీ(ఏయూ) ప్రాంగణంలో వైఎస్సార్‌సీపీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్‌ మేళా కార్యక్రమాన్ని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు పొందిన 22,227 మంది యువతకు అభినందనలు. చదువుతో పాటు ఉపాధి కల్పించాలన్న ఆలోచన ఆం‍ధ్రప్రదేశ్‌ ముఖ్యమం‍త్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డిదే. ఇంత పెద్ద ఉపాధి లభించడం సీఎం జగన్‌కు సంతోషం కలిగించే అంశమని అన్నారు.

తొలి రోజు 13, 663 రెండో రోజు 8,557 మందికి ఉద్యోగాలు లభించాయి. మొత్తం 22,227 మంది రెండు రోజుల్లో ఉపాధి కల్పించడం వైఎస్సార్‌సీపీ సాధించిన రికార్డు. అత్యధికంగా ఏడాదికి 12 లక్షలు 50 వేలు,  అత్యల్పంగా నెలకు 15 వేలు వేతనం ఉద్యోగాలు అందించాము. రానున్న రోజుల్లో మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా విద్యార్థులు ఎదగాలి’’ అని అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top