మచిలీపట్నం: బాలుడి కిడ్నాప్‌ కేసులో ట్విస్ట్‌ | Kidnapping Drama In Machilipatnam, 9th Class Student Fakes Abduction To Escape Studies, Police Reveal Truth | Sakshi
Sakshi News home page

Machilipatnam: బాలుడి కిడ్నాప్‌ కేసులో ట్విస్ట్‌

May 3 2026 11:09 AM | Updated on May 3 2026 1:38 PM

Twist In Student Kidnapping Case In Machilipatnam

సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో 9వ తరగతి విద్యార్ధి కిడ్నాప్‌ ఘటనలో ట్విస్ట్ చోటుచేసుకుంది. విద్యార్ధి కిడ్నాప్ వ్యవహారమంతా డ్రామాగా పోలీసులు తేల్చేశారు. చదువుపై ఆసక్తి లేక... ఇంట్లో చెప్పలేక.. భయంతో ఇంటి నుంచి విద్యార్థి వచ్చేశాడు. సైకిల్‌పై ట్యూషన్‌కు బయలుదేరి సైకిల్‌ను మచిలీపట్నం బస్టాండ్‌లో పెట్టిన ఆ బాలుడు.. బస్ ఎక్కి పెడన వెళ్లాడు. అక్కడ నుంచి రైలులో విజయవాడకు వచ్చాడు.

విజయవాడ వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియక ఆందోళనకు గురైన బాలుడు.. నిజం చెబితే ఏం తల్లిదండ్రులు ఏమంటారోననే భయంతో బాలుడు కిడ్నాప్ కథ అల్లాడు. ట్యూషన్‌కు వెళ్తుంటే తనను బైక్‌పై ఇద్దరు కిడ్నాప్ చేశారంటూ ఆ బాలుడు కిడ్నాప్ డ్రామా ఆడాడు.  ఆ బాలుడు ఓ వ్యక్తి నుంచి ఫోన్ తీసుకుని కుటుంబసభ్యులకు సమాచారమిచ్చాడు.

బంధువుల సాయంతో తల్లిదండ్రులు.. బాలుడిని మచిలీపట్నం తీసుకొచ్చారు. ఏం జరిగిందో ప్రశ్నించడంతో పోలీసుల ఎదుట బాలుడు నిజం ఒప్పుకున్నాడు. బాలుడు, తల్లి దండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు.. పిల్లలను నిరంతరం కనిపెట్టుకుని ఉండాలని పోలీసులు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement