హనుమాన్‌ జన్మస్థలంపై ముగిసిన చర్చలు

TTD Theertha Trust Starts Discussion Over Hanuman Birth Place - Sakshi

సాక్షి, తిరుమల: హనమంతుడి జన్మస్థలంపై సందిగ్ధత తలెత్తిన నేపథ్యంలో గురువారం సంస్కృత విద్యాపీఠంలో ప్రారంభమైన చర్చలు ముగిసాయి. టీటీడీ-హనుమద్‌ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ మధ్య చర్చలు నడిచాయి. కిష్కింధ ట్రస్టు తరపున గోవిందానంద సరస్వతి, టీటీడీ తరపున పండిత పరిషత్‌ కమిటీ చర్చలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా టీటీడీ అందించిన ఆధారాలపై గోవిందానంద సరస్వతి అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ వాదనతో టీటీడీ ఏకీభవించడం లేదని ఆరోపించారు. టీటీడీ ఆధారాలు ప్రామాణికంగా లేవన్నారు గోవిందానంద సరస్వతి. ఇక తిరుమలలోని జపాలి తీర్థమే హనుమాన్ జన్మస్థలం అని టీటీడీ చెప్తుండగా, కాదు కిష్కింధే హనుమంతుడి జన్మస్థలం అని తీర్థ క్షేత్ర ట్రస్టు చెప్తొన్న సంగతి తెలిసిందే. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top