
తిరుమల: డిసెంబర్‌కు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్‌ఈడీ) టికెట్ల కోటాను నవంబర్ 11న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని కోరింది.
సర్వ దర్శనానికి 5 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 2 క్యూ కంపార్ట్‌మెంట్లు నిండాయి. సర్వ దర్శనానికి 5, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు పడుతోంది.మంగళవారం అర్ధరాత్రి వరకు 22,423 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 9,679 మంది తలనీలాలు సమర్పించారు.