విశాఖ జూ పార్కులో పులి మృతి

Tiger died at Visakhapatnam zoo park - Sakshi

ఆరిలోవ(విశాఖ తూర్పు): విశాఖ జూ పార్కులో ఓ ఆడ పులి మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. 20 ఏళ్ల వయసు గల ఈ రాయల్‌ బెంగాల్‌ టైగర్‌(సీత) వృద్ధాప్యంతో పాటు కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతోంది.

ఈ క్రమంలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం పులుల ఎన్‌క్లోజర్‌లో మృతి చెందింది. యానిమల్‌ కీపర్‌ ద్వారా విషయం తెలుసుకున్న జూ అధికారులు పులి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top