జాకీ యూనిట్‌పై రాప్తాడులో టీడీపీ కాకిగోల.. వాస్తవాలతో సాక్ష్యం ఇదిగో

TDP Fake Campaign On Raptadu Jockey Unit - Sakshi

ఇదిగో సాక్ష్యం.. ఇప్పుడేమంటారు?

టీడీపీ కట్టు కథలు, మాయ మాటలు

రాప్తాడులో జాకీ అసలు కథ బట్టబయలు

నాడు కమీషన్లు, నేడు అసత్య ప్రచారం

సాక్షి, అనంతపురం: చేసింది, చేసేది తప్పుడు పనులు.. పైగా కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు ప్రచారాలకు దిగడం టీడీపీ బాగా అలవాటు చేసుకుంది. వైజాగ్‌ గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మిట్‌ విజయవంతం కాగానే.. తెలుగుదేశం నేతలకు ఏం చేయాలో తోచడం లేదేమో!. అందుకే మళ్లీ ఏపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారు.  తాజాగా అనంతపురం జిల్లా రాప్తాడులో జాకీ కంపెనీ యూనిట్‌ భూకేటాయింపుల అంశాన్ని ప్రస్తావిస్తూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారానికి దిగారు. 

‘జాకీ కంపెనీని మేం తెస్తే.. దాన్ని బెదిరించి వెళ్లగొట్టారు’.. ఇది ఇప్పుడు టీడీపీ నేతలు చేసుకుంటున్న ప్రచారం. మరి వాస్తవాలు బయటపెట్టి.. ప్రజల దాకా తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. అందుకే వైఎస్సార్‌సీపీ నేతలు ఆధారాలతో సహా ఆ వ్యవహారాన్ని బయటపెట్టారు. ఇందుకోసం జాకీకి కేటాయించిన స్థలాన్ని పరిశీలించి.. యెల్లో బ్యాచ్‌ చేస్తున్న ఫేక్‌ ప్రచారాన్ని గట్టిగా తిప్పి కొట్టారు.

రాప్తాడులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం సమీపంలోనే జాకీ కోసం 2015లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్థలం కేటాయించాడు. రాప్తాడులో హైవే పక్కనే ఉండే ఈ స్థలం కనీసం విలువ రూ.150 కోట్లు. దీన్ని కేవలం రూ.3 కోట్లకే కట్టబెట్టడం వెనక అవినీతి జరిగింది.  పరిటాల సునీతతో పాటు అప్పటి మంత్రి నారా లోకేష్‌ కూడా ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

విచిత్రమేమంటే.. 2015లో జాకీ కంపెనీకి స్థలం కేటాయిస్తే.. అక్కడ ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణం చేపట్టలేదు. అంటే.. ఇక ఇటుక కూడా కనిపించని స్థలం నుంచి జాకీని వెళ్లగొట్టారంటూ టిడిపి ప్రచారం చేయడం దుర్మార్గం కాక మరేముంది!. మరో విచిత్రం ఏంటంటే.. రాప్తాడు టీడీపీ కట్టిన స్థలం కూడా పండమేటి వెంకటరమణ స్వామి ఆలయ భూమి కబ్జా చేసిందని తేలడం!.

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top