మళ్లీ భానుడి భగభగలు | Sun Intensity Increased In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మళ్లీ భానుడి భగభగలు

May 19 2026 5:12 AM | Updated on May 19 2026 11:28 AM

Sun Intensity Increased In Andhra Pradesh

రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన ఎండ తీవ్రత 

నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 44.3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత 

రానున్న రెండురోజులూ మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండ తీవ్రత మళ్లీ పెరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నాలుగు రోజులు కొద్దిగా ఎండ ప్రభావం తగ్గినా ఇప్పుడు పెరిగింది. వచ్చే నాలుగు రోజుల్లో తీవ్రత ఇంకా పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 44.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.

వైఎస్సార్‌ కడపలో 42.9 డిగ్రీలు, తిరుపతి జిల్లా రాయలచెరువులో 42.8, అనకాపల్లి జిల్లా దేవరాపల్లి, కర్నూలు జిల్లా తోవిలో 42.7, మార్కాపురం జిల్లా నందన మారెళ్లలో 42.6, నంద్యాల జిల్లా పెద్ద దేవలాపురం, పల్నాడు జిల్లా గురజాలలో 42.5, అన్నమయ్య జిల్లా నూలివీడులో 42.4, అనంతపురం జిల్లా రాయదుర్గం, ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్లలో 42.1 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, ఏలూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని  కొన్ని ప్రాంతాల్లో 44 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశి్చమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.  

జర భద్రం..! మూడ్రోజులు అసలు బయటకి రావద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement