రాష్ట్ర స్థాయి కోవిడ్ వ్యాక్సినేషన్ స్టీరింగ్ కమిటీ భేటీ | State Level Covid Vaccination Steering Committee Meeting In Amaravati | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి కోవిడ్ వ్యాక్సినేషన్ స్టీరింగ్ కమిటీ భేటీ

Jan 6 2021 6:09 PM | Updated on Jan 6 2021 6:51 PM

State Level Covid Vaccination Steering Committee Meeting In Amaravati - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో రాష్ట్రస్థాయి కోవిడ్ వ్యాక్సినేషన్ స్టీరింగ్ కమిటీ బుధవారం భేటీ నిర్వహించింది. ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్ అధ్యక్షతన అధికారులతో నిర్వహించిన ఈ సమీక్షలో వ్యాక్సిన్ పంపిణీ సన్నద్ధతపై వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ ప్రజెంటేషన్‌ అందించారు. కేంద్రం సూచనల మేరకు వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధంగా ఉండాలని సీఎస్ అధికారులకు సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎస్‌ ఆదేశించారు. ఫ్రంట్ లైన్ వర్కర్ల డేటాను శాఖల వారీగా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ప్రతిశాఖకు నోడల్ ఆఫీసర్‌ను నియమించుకోవాలని తెలిపారు. తొలి విడతలో సుమారు కోటి మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. పోలింగ్ బూత్ తరహాలో వ్యాక్సిన్‌ సెంటర్లను సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. వ్యాక్సిన్ పంపిణీపై మండల స్థాయిలో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటుకు ఆదేశించారు. చదవండి: ఏ రాష్ట్రం తీసుకోనన్ని చర్యలు తీసుకున్నాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement