కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల్లేవు | Salaries Not Credited to Contract Employees in AP | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల్లేవు

May 4 2026 6:02 AM | Updated on May 4 2026 6:02 AM

Salaries Not Credited to Contract Employees in AP

రెండునెలలుగా 50 వేల మంది ఎదురుచూపులు

మార్చితో గడువు ముగియడంతో సర్వీసు కూడా ఇప్పటివరకు పొడిగించని ఆర్థిక శాఖ

సాక్షి, అమరావతి: వివిధ ప్రభుత్వ శాఖలు, శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న సుమారు 50 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు రెండు నెలలుగా జీతాల్లేక తీవ్ర ఇబ్బందులు  ఎదుర్కొంటున్నారు. వీరి సర్వీసు కాలం ఈ ఏడాది మార్చి నెలాఖరుతో ముగి­సింది. సర్వీసు కాలాన్ని పొడిగించకుండా ఆర్థిక శాఖ తాత్సారం చేస్తుండడంతో వేతనాలు నిలిచిపోయాయి.

సర్వీసు కాలం పొడిగిస్తూ ఆర్థిక శాఖ జీఓ జారీ చేస్తేగానీ వీరికి వేతనాలు రావని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు నిధి పోర్టల్‌లో వీరి వివరాలు నమోదు కాలేదనే సాకుతో ఆర్థికశాఖ  మార్చి నెల వేతనాలు కూడా చెల్లించలేదు. గతంలో కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు కాలాన్ని పొడిగిస్తూ ఆర్థికశాఖ జారీ చేసిన గడువు మార్చితో ముగిసింది. దీంతో ఏప్రిల్‌ వేతనాలనూ చెల్లించలేదు.

సాధారణంగా ఏటా కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు కాలాన్ని ఏడాది పాటు పొడిగిస్తూ ఆర్థికశాఖ జీఓలు జారీ చేస్తుంది. గతంలో జారీచేసిన జీఓ గడువు మార్చి నెలాఖరుతో ముగిసినప్పటికీ మే వచ్చినా వారి సర్వీసు పొడిగింపునకు సంబంధించిన ఉత్తర్వులు జారీచేయలేదు. రెండు నెలల నుంచి జీతాలు లేకపోవడంతో అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాంట్రాక్టు ఉద్యోగులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement