రాష్ట్రంలో పెరుగుతున్న రికవరీ రేటు | Rising Recovery Rate In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో పెరుగుతున్న రికవరీ రేటు

Sep 14 2020 4:10 AM | Updated on Sep 14 2020 4:10 AM

Rising Recovery Rate In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా రికవరీ రేటు 82.37 శాతానికి చేరింది. ఆదివారం ఒక్కరోజే 72,233 టెస్ట్‌లు చేశారు. కొత్తగా 9,536 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా.. 10,131 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. మరో 66 మంది మరణించడంతో మరణాల సంఖ్య 4,912కు చేరింది. ఇక ఆదివారం ఉదయం నాటికి మొత్తం 45,99,826 కరోనా నిర్ధారణ టెస్టులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తంగా 5,67,123 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా.. వీరిలో 4,67,139 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో పది లక్షల జనాభాకు 86,139 టెస్టులు జరుగుతున్నట్టు తాజా గణాంకాలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement