దారి చూపిన ప్రభుత్వం

Problems Solved With New Roads At Parvathipuram Manyam - Sakshi

పార్వతీపురం టౌన్‌: పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో గల జాతీయ రహదారిపై  గోతులతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగేది. గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన రహదారులను ఎమ్మెల్యే అలజంగి జోగారావు చొరవతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలో పార్వతీపురం మండలం నర్సిపురం ప్రధాన రహదారిపై గోతుల వల్ల ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్న ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఏఐఐబీ నిధుల ద్వారా రూ.2 కోట్లు› మంజూరు చేసి కొత్తరోడ్డు వేయించడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తూ ఉత్సాహంతో ప్రయాణాలు చేస్తున్నారు.

కొత్త రహదారితో తీరిన ఇబ్బందులు  
పార్వతీపురం–నర్సిపురం రహదారిలో గతంలో గుంతలతో అవస్థలు పడేవాళ్లం. ఎన్నో ప్రమాదాలు జరిగినా గత పాలకులు పట్టించుకున్న   దాఖలాలు లేవు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే అలజంగి జోగారావు దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే స్పందించి రహదారి నిర్మాణం పూర్తిచేశారు. కొత్త రోడ్డు  వేయడంతో ఇబ్బందులు తీరాయి.  
– గుంటముక్కల దుర్గారావు, 19వ వార్డు, పార్వతీపురం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top