
వైఎస్సార్‌ఏఎఫ్‌యూ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
ప్రవేశ పరీక్ష లేకుండానే మెరిట్ ఆధారంగా అడ్మిషన్
సాక్షి ప్రతినిధి, కడప: సృజనశీలురు, కళలపై ఆసక్తి ఉన్నవారు చదవదగ్గ కోర్సులు.. ఫైన్ ఆర్ట్స్. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలో స్థాపించిన, డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ. 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(బీఎఫ్‌ఏ), బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (బీడీఈఎస్) కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలోనే ప్రఖ్యాత కళా విద్యా సంస్థగా పేరుగాంచిన ఈ యూనివర్సిటీ, ఫైన్ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్, డిజైన్ రంగాలలో నూతన తరం కళాకారులకు శాస్త్రీయ, సృజనాత్మక శిక్షణను అందిస్తోంది.
ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష (ఏడీసెట్) లేకుండానే నేరుగా మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. బీఎఫ్‌ఏలో పెయింటింగ్, శిల్పకళ, యానిమేషన్, అప్లైడ్ ఆర్ట్స్, ఫోటోగ్రఫీ వంటి విభాగాలు అందుబాటులో ఉన్నాయి. పెయింటింగ్ కోర్సులో విద్యార్థులు ఆయిల్, వాటర్ కలర్, అక్రిలిక్ మొదలైన మాధ్యమాల్లో ప్రావీణ్యం సంపాదించగలుగుతారు. శిల్పకళ విభాగంలో మట్టి, రాయి, చెక్క మొదలైన పదార్థాలతో శిల్ప నిర్మాణ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు.
యానిమేషన్ కోర్సు 2డీ, 3డీ, గేమ్ డిజైన్ వంటి ఆధునిక రంగాల్లో ప్రావీణ్యాన్ని కలిగిస్తుంది. అప్లైడ్ ఆర్ట్స్‌లో విద్యార్థులు అడ్వరై్టజింగ్, గ్రాఫిక్ డిజైన్, లోగో రూపకల్పన వంటి కమర్షియల్ కళా విభాగాల్లో శిక్షణ పొందగలుగుతారు. ఫోటోగ్రఫీ విభాగం ఫ్యాషన్, ప్రకృతి, డాక్యుమెంటరీ, డిజిటల్ ఫోటోగ్రఫీ వంటి విభాగాల్లో నైపుణ్యాన్ని అందిస్తుంది.
ఇంటీరియర్ డిజైన్ కోర్సు..
అలాగే బీడీఎస్‌ఈ ఇంటీరియర్ డిజైన్ కోర్సు అందుబాటులో ఉంది, ఇందులో విద్యార్థులు వాస్తుశాస్త్రం, స్పేస్ ప్లానింగ్, ఫర్నిచర్ డిజైన్, లైటింగ్ వంటి అంశాలలో శాస్త్రీయంగా శిక్షణ పొందుతారు. ఆటోకాడ్, స్కెచ్‌అప్, 3డీఎస్ మాక్స్, రివిట్ వంటి సాఫ్ట్‌వేర్‌లపై ప్రాక్టికల్ పరిజ్ఞానం కలిగి ఇంటీరియర్ డిజైన్ రంగంలో కెరీర్ అవకాశాలను పొందగలుగుతారు. ఈ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ఆర్ట్ గ్యాలరీలు, మీడియా సంస్థలు, యానిమేషన్ స్టూడియోలు, ఫొటోగ్రఫీ స్టూడియోలు, అడ్వరై్టజింగ్ ఏజెన్సీలు వంటి వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.
ఆగస్టు 25 వరకు దరఖాస్తుకు అవకాశం..
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 26 జూలై 2025 కాగా, లేట్ ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 25 ఆగస్టు 2025. లేట్ ఫీజుతో దరఖాస్తు చివరి తేదీ 31 ఆగస్టు 2025. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ఠీఠీఠీ.yటట్చజu.్చఛి.జీn ద్వారా దరఖాస్తు చేయవచ్చు.