
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేసేలా.. ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఆదిత్యనాథ్‌దాస్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ శనివారం లేఖ రాశారు. పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉండదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు పట్టణ ప్రాంతాల్లో సమావేశాలు పెట్టి.. గ్రామీణ ప్రాంత ఓటర్లకు పథకాల లబ్ధిని అందజేయకూడదని స్పష్టం చేశారు. అయినా కూడా ఇలాంటి పనులు చేస్తే.. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.