
సాక్షి, ఏలూరు: ఏలూరు జిల్లాలోని దెందులూరులో అక్రమ కేసుల్లో స్థానిక పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ కేసులో చాటపర్రు దళిత సర్పంచ్ గుడిపూడి రఘుకు ఏలూరు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. ఈ క్రమంలో ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.
వివరాల ప్రకారం.. పెదవేగి ఎస్‌ఐ రామకృష్ణ చాటపర్రు దళిత సర్పంచ్ గుడిపూడి రఘును అక్రమంగా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పొలంలో టీడీపీ నేతలు దౌర్జన్యం చేసినప్పటికీ రివర్స్‌లో రఘు సహా మరికొందరిపై పోలీసులు కేసులు పెట్టారు. ఈ క్రమంలో సర్పంచ్ రఘును ఏలూరు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుచగా పోలీసుల అక్రమ కేసుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ రఘు సొంత పూచికత్తు 10వేలతో బెయిల్ మంజూరు చేశారు. రఘును అరెస్ట్ చేసిన ఎస్‌ఐ రామకృష్ణపై మెజిస్ట్రేట్ మండిపడ్డారు. మరోసారి ఆయనకు మెమో జారీ చేశారు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఆదేశాలు జారీచేశారు.
