అందాల పోటీల్లో కేశనపల్లి గిత్తకు ప్రథమ స్థానం

Konaseema: Punganur Cattle Wins First Place in Beauty Pageant - Sakshi

మలికిపురం: రాష్ట్ర స్థాయిలో జరిగిన అందాల పోటీలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం కేశనపల్లి గ్రామం అడబాల లక్ష్మీనారాయణ (నాని)కి చెందిన పుంగనూరు గిత్త ప్రథమ స్థానం పొందింది. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా పెదతాడేపల్లిలో జరిగిన ఈ పోటీలలో ఈ గిత్తకు రూ.30 వేల బహుమతి లభించింది. 


మంత్రి కొట్టు సత్యనారాయణ, శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోసేన్‌రాజు, ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు చేతుల మీదుగా లక్ష్మీనారాయణ బహుమతి అందుకున్నారు. దేశీయ గోజాతి సంవర్ధక అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి.   


ఎత్తు 13 అంగుళాలు.. పొడవు 19 అంగుళాలు

మలికిపురం మండలంలోని పడమటిపాలెం గ్రామంలో సోమవారం అరుదైన పుంగనూరు గిత్త దూడ జన్మించింది. పెద్దిరెడ్డి సత్యనారాయణ మూర్తికి చెందిన పుంగనూరు ఆవుకు ఈ దూడ జన్మించింది. దీని ఎత్తు 13 అంగుళాలు, పొడవు 19 అంగుళాలు ఉంది. పుంగనూరు దూడలన్నీ సాదారణంగా ఇదే సైజులో జన్మిస్తాయి. (క్లిక్ చేయండి: మండ పీతకు మంచి డిమాండ్‌.. 4 లక్షల ఆదాయం!)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top