ఎల్‌బ్రస్‌ శిఖరం అధిరోహించిన తెలుగు యువతి | Kakinada Woman Suthapalli Devi Climbed The Mount Elbrus Peak | Sakshi
Sakshi News home page

ఎల్‌బ్రస్‌ శిఖరం అధిరోహించిన తెలుగు యువతి

Aug 16 2021 11:45 AM | Updated on Aug 16 2021 12:34 PM

Kakinada Woman Suthapalli Devi Climbed The Mount Elbrus Peak - Sakshi

సుతాపల్లి దేవి

భానుగుడి (కాకినాడ సిటీ): యూరప్‌ దేశాల్లోనే అత్యంత ఎత్తయిన ఎల్‌బ్రస్‌ శిఖరంపై.. మన స్వాత్రంత్య్ర దినోత్సవం నాడే మువ్వన్నెల జెండా రెపరెపలాడించి సంచలన రికార్డు నమోదు చేసిందో యువ ట్రెక్కర్‌. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన సుతాపల్లి దేవి(23)కి ట్రెక్కింగ్‌ అంటే అమితాసక్తి. ఆ ఆసక్తితోనే యూరప్‌ దేశాల్లోనే అత్యంత ఎత్తయిన ఎల్‌బ్రస్‌ శిఖరాన్ని (5,672 మీటర్లు) కేవలం నాలుగు రోజుల్లో అధిరోహించి.. అక్కడ మన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఔరా! అనిపించింది.

ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ మనకు స్వాతంత్య్రం వచ్చిన రోజునే ఎల్‌బ్రస్‌ శిఖరంపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించడం తన జీవితంలో మరచిపోలేని ఆనందక్షణాలని సంతోషం వ్యక్తం చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement