Ambati Rambabu Says Flood Relief Measures Have Been Intensified: AP Heavy Rain - Sakshi
Sakshi News home page

Ambati Rambabu: ‘వరద సహాయక చర్యలు ముమ్మరం చేశాం’

Jul 14 2022 5:11 PM | Updated on Jul 14 2022 5:30 PM

Flood Relief Measures Have Been Intensified Ambati Rambabu - Sakshi

జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు

విజయవాడ: వరద సహాయక చర్యలను ముమ్మరం చేశామని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ప్రాజెక్టుల వద్ద వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘కృష్ణా, గోదావరి నదులకి వరద ప్రచాహం వస్తోంది.  గత వందేళ్లలో జులై నెలలో ఇంతటి వరద రావడం ఇదే మొదటిసారి. ఊహకి అందని విధంగా వరదలు వచ్చాయి. నిర్వాసితులని వరద ప్రాంతాల నుంచి తరలించడానికి చర్యలు తీసుకున్నాం.

పోలవరం వద్ద గోదావరి 16 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. ఇప్పటికిపుడు ఈ వరదలు తగ్గే పరిస్ధితి కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి, ఎ‌న్డీఆర్ఎఫ్ బృందాలకి ప్రజలు సహకరించాలి. మేకపాటి గౌతమ్ రెడ్డి, సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్‌లను ఆగస్టు 15న సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించబోతున్నారు’ అని అంబటి తెలిపారు.

ఇక పోలవరం ప్రాజెక్టుపై త్వరలోనే శ్వేతప్రతం విడుదల చేస్తామని, దశల వారీగా పోలవరం పూర్తి చేస్తామన్నారు అంబటి రాంబాబు. పోలవరం పనులతో పాటు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజ్‌ను కూడా అమలు చేయడం జరుగుతుందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement