ఏలూరు కార్పొరేషన్‌: 47 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ గెలుపు

Eluru Municipal Corporation Elections: Counting Live Updates - Sakshi

లైవ్‌ అప్‌డేట్స్‌

వైఎస్సార్‌సీపీ ప్రభంజనం
ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్‌ ముగిసింది. ఏలూరు కార్పొరేషన్‌ను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. ఏలూరు మేయర్ పీఠం వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. 50 డివిజన్ల  ఫలితాలు వెల్లడికాగా,  47 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ గెలుపు సాధించింది. కేవలం 3 స్థానాలకే టీడీపీ పరిమితమైంది.

► 1వ డివిజన్‌ ఎ.రాధిక (వైఎస్సార్‌సీపీ) విజయం
2వ డివిజన్ వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి నరసింహారావు గెలుపు, 787 ఓట్ల మెజార్టీతో జె.నరసింహారావు విజయం.
► 3వ డివిజన్‌ బి.అఖిల (వైఎస్సార్‌సీపీ) విజయం
► 4వ డివిజన్‌ డింపుల్ (వైఎస్సార్‌సీపీ) విజయం, 744 ఓట్ల మెజార్టీతో డింపుల్ గెలుపు
► 5వ డివిజన్‌ జయకర్ (వైఎస్సార్‌సీపీ) విజయం, 865 ఓట్ల మెజార్టీతో జయకర్ విజయం
► 10వ డివిజన్‌ పైడి భీమేశ్వరరావు (వైఎస్సార్‌సీపీ)  గెలుపు, 812 ఓట్ల మెజార్టీతో పైడి భీమేశ్వరరావు విజయం
► 11వ డివిజన్‌ కోయ జయగంగ (వైఎస్సార్‌సీపీ)  గెలుపు, 377 ఓట్ల మెజార్టీతో కోయ జయగంగ విజయం
► 12వ డివిజన్‌ కర్రి శ్రీను (వైఎస్సార్‌సీపీ) గెలుపు, 468 ఓట్ల మెజార్టీతో కర్రి శ్రీను విజయం
► 17వ డివిజన్‌ టి.పద్మ (వైఎస్సార్‌సీపీ) విజయం, 755 ఓట్ల మెజార్టీతో టి.పద్మ గెలుపు
► 18వ డివిజన్‌ కేదారేశ్వరి (వెస్సార్‌సీపీ) విజయం, 1012 ఓట్ల మెజార్టీతో కేదారేశ్వరి గెలుపు
► 19వ డివిజన్‌ వై.నాగబాబు (వెస్సార్‌సీపీ) విజయం, 1012 ఓట్ల మెజార్టీతో వై.నాగబాబు విజయం
► 22వ డివిజన్‌ సుధీర్‌బాబు (వైఎస్సార్‌సీపీ) గెలుపు


► 23వ డివిజన్ కె.సాంబ (వైఎస్సార్‌సీపీ) విజయం, 1823 ఓట్ల మెజార్టీతో కె.సాంబ గెలుపు
►  24వ డివిజన్ మాధురి నిర్మల (వైఎస్సార్‌సీపీ) గెలుపు, 853 ఓట్ల మెజార్టీతో మాధురి నిర్మల విజయం 
► 25వ డివిజన్‌ గుడుపూడి శ్రీను (వైఎస్సార్‌సీపీ) గెలుపు
26వ డివిజన్‌ అద్దంకి హరిబాబు(వైఎస్సార్‌సీపీ) గెలుపు, 1,111 ఓట్ల మెజార్టీతో అద్దంకి హరిబాబు విజయం
► 31వ డివిజన్‌ లక్ష్మణ్‌ (వైఎస్సార్‌సీపీ) విజయం, 471 ఓట్ల మెజార్టీతో లక్ష్మణ్ గెలుపు
► 32వ డివిజన్ సునీత రత్నకుమారి (వైఎస్సార్‌సీపీ) గెలుపు


► 33వ డివిజన్‌ రామ్మోహన్‌రావు (వైఎస్సార్‌సీపీ) విజయం, 88 ఓట్ల మెజార్టీతో రామ్మోహన్‌రావు గెలుపు
36వ డివిజన్ హేమ సుందర్ (వైఎస్సార్‌సీపీ) విజయం
38వ డివిజన్ వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి విజయం, 261 ఓట్ల మెజార్టీతో హేమా మాధురి గెలుపు
39వ డివిజన్ వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి విజయం, 799 ఓట్ల మెజార్టీతో కె.జ్యోతి విజయం
40వ డివిజన్‌ టి.నాగలక్ష్మి (వైఎస్సార్‌సీపీ) గెలుపు, 758 ఓట్ల మెజార్టీతో టి.నాగలక్ష్మి విజయం
► 41వ డివిజన్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి కల్యాణి విజయం, 547 ఓట్ల మెజార్టీతో కల్యాణి దేవి విజయం
► 42వ డివిజన్ వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి విజయం, 79 ఓట్ల మెజార్టీతో ఎ.సత్యవతి విజయం
►  43వ డివిజన్ జె.రాజేశ్వరి (వైఎస్సార్‌సీపీ) గెలుపు


► 45వ డివిజన్‌ ముఖర్జీ (వైఎస్సార్‌సీపీ) గెలుపు, 1058 ఓట్ల మెజార్టీతో ముఖర్జీ విజయం
► 46వ డివిజన్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి ప్యారీ బేగం విజయం, 1,232 ఓట్ల మెజార్టీతో ప్యారీ బేగం గెలుపు
► 48వ డివిజన్‌ స్వాతి శ్రీదేవి (వైఎస్సార్‌సీపీ) విజయం, 483 ఓట్ల మెజార్టీతో స్వాతి శ్రీదేవి గెలుపు
50వ డివిజన్‌ షేక్ నూర్జహాన్ (వైఎస్సార్‌సీపీ) విజయం, 1495 ఓట్ల మెజార్టీతో షేక్ నూర్జహాన్ గెలుపు

► 26 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ ముందంజ
► 50వ డివిజన్ వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి షేక్ నూర్జహాన్ ఆధిక్యం
ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ హవా
20 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ ముందంజ
41వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీఅభ్యర్ధి కల్యాణి విజయం

 8వ డివిజన్‌లో ఫైనల్ కౌంటింగ్ కొనసాగుతోంది. 
 2,10, 31, 33, 36, 39, 45, 46, 47 డివిజన్లలో ఫైనల్ కౌంటింగ్ కొనసాగుతోంది.

 ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
 50 పోస్టల్‌ బ్యాలెట్లలో పోలైన ఓట్లు 15, 
 వైఎస్సార్‌సీపీ- 11, చెల్లనవి- 2, నోటా-1, టీడీపీ-1

 ఓట్ల  కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 
 తొలుత 50 పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లను కౌంటింగ్ సిబ్బంది లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్లింపు అనంతరం డివిజన్ల వారీగా ఓట్ల లెక్కిస్తారు. ప్రతీ టేబుల్‌కి ప్రతీ రౌండ్‌లో1000 ఓట్ల లెక్కిస్తారు. ప్రతీ టేబుల్‌కి 25 ఓట్లని బండిల్‌గా కట్టి 40 బండిల్స్‌గా లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు స్వయంగా జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ పర్యవేక్షిస్తున్నారు. 
► ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌ ప్రారంభమైంది.

సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. ఏలూరు శివారులోని సీఆర్‌ రెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. 47 డివిజన్లకు 48 టేబుల్స్‌పై ఒకే రౌండ్‌లో ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 12 గంటలకల్లా పూర్తై తుది ఫలితాలు వెల్లడికాన్నాయి.

నలుగురు సీనియర్ ఆఫీసర్లను నాలుగు కౌంటింగ్ హాళ్లకు సూపర్ వైజర్లుగా నియమించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరా, వీడియోగ్రఫీతో పర్యవేక్షించనున్నారు.  కౌంటింగ్ సిబ్బంది అందరికీ  కోవిడ్ టెస్టులు, మాస్క్, ఫేస్ షీల్డ్ లేనిదే కౌంటింగ్ హాలులోకి అనుమతి నిరాకరిస్తామని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని అధికారులు తెలిపారు.

కాగా, ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి 50 డివిజన్లలో ఇప్పటికే మూడు డివిజన్లు వైఎస్సార్‌సీపీ​కి ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. మార్చిలో ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా వేచిచూస్తున్న అభ్యర్థుల గెలుపోటములు నేడు వెల్లడి కానున్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top