స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కాంలో ఈడీ దూకుడు, రూ.31 కోట్ల ఆస్తుల అటాచ్

Ed Attached Assets Worth Rs 31 Crore In Skill Development Scam - Sakshi

సాక్షి, విజయవాడ: చంద్రబాబు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దూకుడుగా ముందుకెళ్తోంది. డిజైన్‌టెక్‌ సిస్టమ్స్‌కు చెందిన రూ.31.20 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో డిజైన్‌టెక్‌ మనీ లాండరింగ్‌కి పాల్పడింది. నిధుల దుర్వినియోగం, మనీ లాండరింగ్ కేసు నేపథ్యంలో ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

స్కిల్‌ స్కామ్‌లో ఏపీ సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది. షెల్‌ కంపెనీల ద్వారా నిధులు మళ్లించినట్లు విచారణలో వెల్లడయ్యింది. ఇప్పటికే డిజైన్‌టెక్‌ ప్రతినిధులు వికాస్‌, సుమన్‌ బోస్‌, ముకుల్‌ చంద్ర అగర్వాల్‌, సురేష్‌ గోయల్‌ను ఈడీ అరెస్ట్‌ చేసింది.
చదవండి: ‘స్కిల్డ్‌’ క్రిమినల్‌ బాబే

కాగా, టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌­ఎస్‌డీసీ) కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ అప్పటి సీఎం చంద్రబాబే అన్న సంగతి తెలిసిందే.. జర్మనీకి చెందిన సీమెన్స్‌ కంపెనీ పేరుతో కథ నడ­పటం.. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిధులు విడుదల చేయడం.. అందుకోసం ఉన్నతాధికారులపై ఒత్తిడి తేవడం.. అనంతరం ఆ నిధులను షెల్‌ కంపెనీల పేరిట హవాలా మార్గంలో టీడీపీ పెద్దల ఖాతాల్లోకి చేర్చడం.. అంతా కూడా చంద్రబాబు పక్కా పన్నాగం ప్రకారమే సాగిందన్నది ఆధారసహితంగా వెల్లడైంది.
చదవండి: శ్వేత మృతికి కారణం ఏంటంటే..? షాకింగ్‌ విషయాలు వెల్లడించిన సీపీ

టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.3,300 కోట్ల సీమెన్స్‌ ప్రాజెక్టు పేరిట ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణంపై సీఐడీ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగుచూశాయి. ఈ ప్రాజెక్టు సమయంలో అప్పటి ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న ముగ్గురు ఉన్నతాధికారులను సీఐడీ విచారించగా ఈ వాస్తవాలు వెలుగుచూశాయి. పూర్తిగా చంద్రబాబు ఆదేశాలతోనే నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేసినట్లు తేలింది.

ఇకనైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టు పేరిట నిధులు కొల్లగొట్టడానికి చంద్రబాబు ఏపీఎస్‌ఎస్‌డీసీని ఓ సాధనంగా చేసుకున్నారు. అందుకోసం జర్మనీకి చెందిన సీమెన్స్‌ కంపెనీ పేరిట రూ.3,300 కోట్ల ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు గురించి సీమెన్స్‌ కంపెనీ ప్రధాన కార్యాలయానికి ఏమీతెలీదు. అప్పట్లో సీమెన్స్‌ కంపెనీ ఎండీగా వ్యవహరించిన సుమన్‌ బోస్‌ను అడ్డంపెట్టుకుని కథ నడిపారు. అందుకోసం చంద్రబాబు కనుసన్నల్లోనే ప్రాజెక్టును రూపొందించారు.

ఆ పన్నాగంలో భాగంగానే 2014–15లో అప్పటి సీఎం చంద్రబాబును సుమన్‌ బోస్, డిజైన్‌ టెక్‌ కంపెనీ ఎండీ వికాస్‌ కన్విల్కర్‌ కలిశారు. ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్‌టెక్‌ సంస్థలు 90 శాతం నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ వ్యవహారంలో ఏపీఎస్‌ఎస్‌డీసీకి అప్పట్లో డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, చంద్రబాబు సన్నిహితుడు కే లక్ష్మీనారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు కీలకంగా వ్యవహరించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top