సీఎం జగన్‍ను కలిసిన ఈస్టర్న్‌ నేవీ కమాండ్‌ చీఫ్‌ | Eastern Navy Command Chief Meet AP CM YS Jagan | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‍ను కలిసిన ఈస్టర్న్‌ నేవీ కమాండ్‌ చీఫ్‌.. విశాఖలో వేడుకలకు రావాలని ఆహ్వానం

Oct 21 2022 5:11 PM | Updated on Oct 21 2022 9:17 PM

Eastern Navy Command Chief Meet AP CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశారు తూర్పు నావికా దళం ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ ఛీఫ్, వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌ దాస్‌గుప్తా.  తూర్పు సముద్ర తీరంలో భద్రతకు సంబంధించి తలెత్తుతున్న సవాళ్ళను అధిగమించేందుకు భారత నావికాదళం చేపట్టిన వివిధ కార్యక్రమాలను వివరించారు. డిసెంబర్‌ 4 ఇండియన్‌ నేవీ డే సందర్భంగా విశాఖలో జరిగే వేడుకలకు జగన్‌ను ఆహ్వానించారు. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ మోడల్‌ను సీఎంకు బహుకరించారు.

ఈ సందర్బంగా సీఎం వైఎస్‌ జగన్.. దాస్‌గుప్తాని సన్మానించి శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందజేశారు‌.  నేవీ ఉన్నతాధికారులు కెప్టెన్‌ వీఎస్‌సీ రావు (సివిల్‌ మిలటరీ లైజన్‌ (అడ్వైజరీ), కెప్టెన్‌ అభిషేక్‌ కుమార్, లెఫ్టినెంట్‌ పీఎస్‌. చౌహాన్‌ కూడా జగన్‌కు కలిశారు.


చదవండి: జలవనరుల శాఖ, పోలవరం పనులపై సీఎం జగన్‌ సమీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement