
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఒకేరోజు 4,739 మంది కోలుకోవడంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 7,54,415కి చేరింది. గడిచిన 24 గంటల్లో 74,422 మందికి పరీక్షలు చేయగా 3,746 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది. ఇప్పటివరకూ 72,71,050 మందికి పరీక్షలు చేశారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,93,299కి చేరింది. తాజాగా 27 మంది మృతితో మొత్తం మరణాలు 6,508కి చేరాయి. యాక్టివ్ కేసులు 32,376 ఉన్నాయి.