సాక్షి, కాకినాడ: కాకినాడలో సంచలన ఘటన వెలుగు చూసింది. కానిస్టేబుల్ నాగేశ్వర రావు హత్య స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. కాగా, సదరు కానిస్టేబుల్ కొంత కాలంగా సస్పెన్షన్‌లో ఉన్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడలోని గాంధీనగర్ రెడ్ క్రాస్ సమీపంలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ జి.నాగేశ్వరరావు (46) సోమవారం తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తి దాడిలో హత్యకు గురైనట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


