
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రేపు(ఆదివారం) తిరుపతి పర్యటనకు వెళ్తున్నారు. ప్రధాని మోదీ తిరుపతికి వస్తున్న నేపథ్యంలో ఆయనకు సీఎం జగన్ స్వాగతం పలుకునున్నారు.
ఇదిలా ఉండగా.. రెండు రోజల పర్యటన కోసం ప్రధాని మోదీ తిరుపతి వెళ్తున్నారు. మరోవైపు.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోదీ శనివారం తెలంగాణ పర్యటనలో ఉన్నారు. బీజేపీ తరఫున పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.