సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు సీఎం జగన్‌ నివాళి | CM YS Jagan Pays Tribute To Sarvepalli Radhakrishnan | Sakshi
Sakshi News home page

CM YS Jagan: సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు సీఎం జగన్‌ నివాళి

Sep 5 2021 12:23 PM | Updated on Sep 5 2021 1:33 PM

CM YS Jagan Pays Tribute To Sarvepalli Radhakrishnan - Sakshi

సాక్షి, అమరావతి: మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్‌ పాల్గొన్నారు.

‘‘చదువే తరగని ఆస్తి.. గురువే రూపశిల్పి.. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న గురువులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ఉపాధ్యాయులందరికీ టీచర్‌ డే శుభాకాంక్షలు’’ అంటూ సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

ఇవీ చదవండి:
సీఎం వైఎస్‌ జగన్‌కు అర్చక సమాఖ్య కృతజ్ఞతలు 
కోవిడ్‌ కట్టడిలో కేరళ కంటే.. ఏపీ చర్యలు భేష్‌

Advertisement
 
Advertisement
Advertisement