
రైతులకు దక్కాల్సిన డబ్బులను కాజేసే కుట్రలు
పౌరసరఫరాల సంస్థ ధాన్యం సేకరణ వెబ్‌సైట్ డేటా ట్యాంపరింగ్
నిజమైన రైతుల పేర్లను తొలగించి నకిలీల వివరాలు
బాపట్ల జిల్లాలో రూ.2.50 కోట్లు విడుదలకు అనుమతి
ఇప్పటికే రూ.70 లక్షల వరకు చెల్లింపులు పూర్తి
గుంటూరు, పల్నాడు జిల్లాల్లోనూ అదే బాగోతం
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో ఒకవైపు ఏ పంటకూ గిట్టుబాటు ధరలు దక్కక అల్లాడుతుండగా మరోవైపు సొంతంగా ధాన్యాన్ని మిల్లులకు తరలించిన రైతులకు దక్కాల్సిన రవాణా చార్జీలను సైతం అడ్డదారిలో దోపిడీ చేయడం అవినీతికి పరాకాష్టగా నిలుస్తోంది. ఏకంగా పౌరసరఫరాల సంస్థ ప్రధాన కార్యాలయం కేంద్రంగా ఈ వ్యవహారం సాగుతోంది. ‘ధాన్యం సేకరణ’ వెబ్‌సైట్ డేటాను ట్యాంపరింగ్ చేసి దాదాపు రూ.7 కోట్ల మేర రవాణా చార్జీలను కాజేసే కుట్రలకు తెర తీశారు.
రైతుల ఫిర్యాదుతో..
గత ప్రభుత్వం 2021–22 ఖరీఫ్ సీజన్‌లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో సుమారు మూడు లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ధాన్యాన్ని మిల్లులకు తరలించినందుకు రైతులు, ఇతర రవాణాదారులకు సుమారు రూ.7 కోట్ల వరకు చార్జీలు చెల్లించాల్సి ఉంది. అయితే మిల్లర్లకు రవాణా చార్జీలు వెళ్తున్నాయని ‘స్పందన’లో రైతులు ఫిర్యాదు చేయడంతో చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో రైతులు మినహా మిల్లర్లు, సప్లయర్స్, ప్రైవేటు వ్యక్తులకు ట్రాన్స్‌పోర్టు చార్జీలు చెల్లించాలంటే కచి్చతంగా జాయింట్ కలెక్టర్లు సరి్టఫై చేయాలని గత ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఈ నేపథ్యంలో తమ వివరాలు అందచేసిన రైతులకు సుమారు రూ.20 లక్షలు రవాణా చార్జీలు చెల్లిం
చింది. అయితే 2021–22 ఖరీఫ్‌కు సంబంధించి ట్రాన్స్‌పోర్టు చార్జీల్లో సుమారు రూ.6.80 కోట్లు ‘అనామతు’ ఖాతాలో ఎవరికీ చెందనివిగా మిగిలిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక దీనిపై కొందరు మిల్లర్ల కన్ను పడింది.
ఫోరెన్సిక్ ఆడిట్‌తో గుట్టు రట్టే!
ధాన్యం సేకరణ పోర్టల్‌లో సైబర్ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి డేటాలో మార్పులు, టైమ్‌స్టాంప్‌లు, యూజర్ ఐడీ, యాక్సెస్ లాగిన్‌లను గుర్తిస్తే గుట్టురట్టు అవుతుంది. చెల్లింపులపై విజిలెన్స్ విచారణ నిర్వహించి వాహనాల వివరాలను పరిశీలిస్తే అవినీతి బయటపడుతుంది. సరుకు రవాణాకు అనువుగా లేని వాహనాల వివరాలను కూడా సమరి్పంచి సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది.
పోర్టల్‌లో డేటా మార్చేసి..
బాపట్ల ప్రాంతానికి చెందిన కొందరు మిల్లర్లు రవాణా చార్జీలు కొట్టేయాలని పథకం రచించారు. పౌరసరఫరాల సంస్థ ప్రధాన కార్యలయంలోని కొందరు అధికారులతోపాటు గుంటూరులోని సంస్థ కార్యాలయం మేనేజర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ సాయంతో కథ నడిపించారు. ‘ధాన్యం సేకరణ’ పోర్టల్ నిర్వహణను పర్యవేక్షించే ప్రైవేట్ ఏజెన్సీ ఇంజనీర్‌ను రంగంలోకి
దించి డేటాబేస్‌ను ట్యాంపరింగ్ చేశారు. రైతుల పేర్లను తొలగించి మిల్లర్లు సూచించిన వ్యక్తుల వివరాలను చేర్చారు. ఇవేమీ తెలియని బాపట్ల జిల్లా జేసీ క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టకుండా పౌరసరఫరాల
సంస్థ అధికారులు అందచేసిన జాబితాను సరి్టఫై చేసేశారు. దీంతో సుమారు రూ.2.50 కోట్లకు పైగా నిధుల విడుదలకు కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది. ఇందులో రూ.70 లక్షలకు పైగా చెల్లింపులు కూడా పూర్తయ్యాయి. అనామతు ఖాతాలో సొమ్మును కొట్టేసేందుకు రాజకీయ పలుకుబడితో సైబర్ నేరాలకు పాల్పడటం విస్తుగొలుపుతోంది. ఈ విషయాన్ని పసిగట్టిన గుంటూరు, పల్నాడుకు చెందిన కొందరు మిల్లర్లు సైతం డీఎం, డీఈవో సాయంతో డేటాను తారుమారు చేయించారు. అక్కడ సైతం ట్రాన్స్‌పోర్టు బిల్లులు కాజేసేందుకు రంగం సిద్ధమైంది.