వైజాగ్‌ టెక్‌ సమ్మిట్‌ 2023కు కేంద్రం మద్దతు

Central Govt supports Vizag Tech Summit 2023 - Sakshi

సాక్షి, అమరావతి: ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైజాగ్‌ టెక్‌ సమ్మిట్‌ 2023కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మద్దతు ప్రకటించారు. ఫిబ్రవరి 16–17 తేదీల్లో జరిగే  సమ్మిట్‌కు కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆర్థికమంత్రి హామీ ఇచ్చినట్లు సమ్మిట్‌ నిర్వాహకులు పరల్స్‌ గ్రూప్‌ సీఈవో శ్రీనుబాబు గేదెల ప్రకటించారు.

గురువారం పార్లమెంట్‌ ఆవరణలో నిర్మలా సీతారామన్‌ను కలిసి సమ్మిట్‌ వివరాలను తెలియచేసినట్లు తెలిపారు. జీ20 అధ్యక్ష దేశంగా భారత్‌ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో గ్లోబల్‌ టెక్‌ సమ్మిట్‌ విజయవంతానికి సహకారం అందిస్తా­మని, సమ్మిట్‌ ద్వారా జీ–20 విజన్‌ను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరినట్లు శ్రీనుబాబు తెలిపారు.

జీ20 సదస్సులకు మద్దతుగా న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో గ్లోబల్‌ టెక్‌ సమ్మిట్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు.   సమ్మి­ట్‌ ద్వారా రూ.3,000 కోట్లకుపైగా పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top